Chekuri rama rao biography in telugu
Chekuri Ramarao (–), known as CheRa, is one of the critics in Telugu who brought criticism to the reach of the readers by using lucid language and..
చేకూరి రామారావు
తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పిలువబడేవారు డాక్టర్ చేకూరి రామారావు (అక్టోబర్ 1, 1934 - జూలై 24, 2014).
చేరాగా అందరికి సువరిచితులు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యాడు.
Chekuri Ramarao.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈయన 1934, అక్టోబరు 1నఖమ్మం లోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు.
హెచ్ ఎస్ సి వరకు మచిలీపట్నంలో చదువుకున్నాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ (తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తూమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభధ్రులయ్యాడు.
భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు భాషా పరివర్తన సిద్ధాంతం ('ట్రాన్స్‌ఫర్మేషన్ థియరీ ఇన్ తెలుగు') అనే అంశంపై పిహెచ్‌డి పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పనిచేస్తున్న కాలంలో చేరా దగ్గర డాక్టర్ ద్వానా శాస్త్రి శిక్షణపొందాడు.
తన నివాసంలో ధ్యానం చేస్తుండగా 24 జూలై, 2014 రాత్రి గుండెప